14 – శిశువులను చంపడం

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: శిశువులను చంపడం.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.

“తరువాత ఆ ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు. నువ్వు నా పిల్లలను చంపి ఆ ప్రతిమలకు దహనబలిగా అర్పించావు. నీ బాల్యంలో నువ్వు నగ్నంగా, వస్త్రహీనంగా ఉండి నీ రక్తంలో నువ్వు పొర్లుతూ ఉన్న సంగతి మర్చిపోయి ఈ అసహ్యమైన వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చావు.

దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 96 వాక్యాలు

దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.

“ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”

హత్య చెయ్యకూడదు.

ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.

ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి. తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం,

దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను.

ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.

నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోగాని ఎవరైనా తన పిల్లలను మోలెకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణ శిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. అతడు తన సంతానాన్ని మోలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను. ఆ వ్యక్తి తన సంతానాన్ని మోలెకుకు ఇస్తుండగా మీ దేశ ప్రజలు చూసి కూడా కళ్ళు మూసుకుంటే, వాణ్ణి చంపక పొతే అప్పుడు నేనే వాడికి, వాడి వంశానికి విరోధినై వాణ్ణి ప్రజల్లో లేకుండా చేస్తాను. మోలెకుతో వేశ్యరికం చెయ్యడానికి వాడి వెంటబడి వ్యభిచారం చేసే వారందరినీ ప్రజల్లో లేకుండా చేస్తాను.

ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి.

ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.

మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.

హత్య చేయకూడదు.

వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.

తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,

“నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి. “ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.

అతడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ, తన కొడుకును దహన బలిగా అర్పించాడు.

ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.

ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.

అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

బెన్‌ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు.

బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు. ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా? ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు. మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు.

ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.

గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా.

యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు. ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు.

ఎందుకంటే గర్భంలోనుంచి నన్ను తీసిన వాడివి నువ్వే. నేను నా తల్లి రొమ్ములపై ఉన్నప్పుడే నీపై నమ్మకం పుట్టించావు. గర్భంలో ఉండగానే నేను నీ మీద ఆధారపడ్డాను. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటినుంచి నువ్వే నా దేవుడివి.

పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు. నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు. నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.

తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.

నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి. పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి. వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.

వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు. వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు. బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?

దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు. వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు. అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.

వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది. తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు. కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.

నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి. నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.

చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు. నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే. నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

ఆయన నీ ద్వారబంధాల గడులు దిట్టం చేశాడు. మీ నివాసాల మధ్య మీ పిల్లలను ఆశీర్వదించాడు.

దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం. ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.

అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు. యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు. అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు,

మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు. “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా?

వేరొకడి రక్తం చిందించిన వాడు దోషం మూటగట్టుకొన్నవాడు. వాడు మరణ దినం దాకా పారిపోతూనే ఉంటాడు.

స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.

మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.” మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి. యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ.

ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు. భూమి తనపై జరిగిన రక్తపాతాన్ని బహిర్గతం చేస్తుంది. వధకు గురైన వాళ్ళని ఇక దాచి పెట్టదు.”

నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ, భయపడకు.

గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.

యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానంలో మిగిలిన వారలారా, మీరు గర్భంలో ప్రవేశించింది మొదలుకుని నేను మిమ్మల్ని భరించాను. మీరు తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. నా మాట వినండి.

ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు.

యెహోవా దృష్టికి నేను గౌరవనీయుణ్ణి. నా దేవుడు నాకు బలం. తనకు సేవకుడుగా ఉండడానికి, తన దగ్గరికి యాకోబును మళ్ళీ రప్పించాలనీ ఇశ్రాయేలును ఆయన దగ్గరికి చేర్చేలా నన్ను గర్భంలో రూపొందించాడు. యెహోవా ఇలా చెబుతున్నాడు.

స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను. చూడు, నా అరచేతుల్లో నిన్ను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.

యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, “నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”

నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది. వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు. ఇంతా చేసినా నువ్వు “నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే” అని చెప్పుకుంటున్నావు. ఇదిగో చూడు, “నేను పాపం చేయలేదు” అని నువ్వు చెప్పిన దాన్నిబట్టి నిన్ను శిక్షిస్తాను.

నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.

ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు. వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.” కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్‌ హిన్నోము లోయ అని గానీ అనరు. ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.

యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.

అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.

యెహోవా ఇలా అంటున్నాడు. “రమాలో ఏడుపు, మహా రోదన స్వరం వినిపిస్తూ ఉంది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తూ ఉంది. ఆమె పిల్లలు చనిపోయిన కారణంగా ఆదరణ పొందడానికి నిరాకరిస్తూ ఉంది.”

వాళ్ళు తమ కొడుకులను, కూతుళ్ళను మొలెకుకు బలి ఇవ్వడానికి బెన్‌ హిన్నోము లోయలో ఉన్న బయలు దేవుడికి గుళ్ళు కట్టారు. ఇలా చెయ్యడానికి నేను వాళ్లకు ఆజ్ఞ ఇవ్వలేదు. యూదా వాళ్ళు పాపంలో పడి, ఇంత అసహ్యమైన పనులు చేస్తారని నా హృదయంలో ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు.

“తరువాత ఆ ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు. నువ్వు నా పిల్లలను చంపి ఆ ప్రతిమలకు దహనబలిగా అర్పించావు. నీ బాల్యంలో నువ్వు నగ్నంగా, వస్త్రహీనంగా ఉండి నీ రక్తంలో నువ్వు పొర్లుతూ ఉన్న సంగతి మర్చిపోయి ఈ అసహ్యమైన వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చావు. బాధ! నీకు బాధ” ఇది ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి, ఈ దుర్మార్గమంతటికీ తోడుగా,

ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక, ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను! నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నా కోపంతో నా రోషంతో కూడిన రక్తపాతం నీ మీదకు తెప్పిస్తాను.

“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు. ఇంకా వాళ్ళు ఇలాగే నా పట్ల జరిగిస్తున్నారు. ఇంతే కాక, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన రోజే, నేను నియమించిన విశ్రాంతి దినాలను కూడా అపవిత్రం చేశారు. తాము పెట్టుకున్న విగ్రహాల పేరట తమ పిల్లలను చంపిన రోజే, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణంలోకి వచ్చి దాన్ని అపవిత్రం చేసి, నా మందిరంలోనే వాళ్ళు ఈ విధంగా చేశారు.

యెహోవా చెప్పేదేమిటంటే, “అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు.

ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.

‹“‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.›

‹“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.›

‹5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.›

‹నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.› ‹నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.› ‹10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.› ‹“మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి,›

‹అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.›

అప్పుడు యేసు, ‹“చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే”› అని వారితో చెప్పాడు.

‹ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,›

‹దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి”› అన్నాడు.

అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.

ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది. “స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది. నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.

‹వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా”› అని అతనితో అన్నాడు.

‹నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు.› ‹మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.› ‹నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.›

‹స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.›

వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు. వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.

మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.

అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.

పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.

దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.

ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.

మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.

సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.

తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.

వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?”

పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net